అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని మూడు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు(Bomb threats) వచ్చాయి . దీంతో పోలీసలు, కోర్టు సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు ప్రారంభించారు. అనంతపురం, ఏలూరు, మదనపల్లె కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం కోర్టులకు బాంబు పెట్టామని మెయిల్ ( E Mail ) ద్వారా బెదిరించారు.
మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందజేశారు. దీంతో కోర్టులో ఉన్న న్యాయమూర్తులను, న్యాయవాదులను, సిబ్బందిని బయటకు పంపి కోర్టుల ఆవరణలో పోలీసులు, బాంబుస్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశారు. బాంబులు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.