Mamata Banerjee | కోల్‌కతాలో ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ దాడులు.. తీవ్రంగా ఖండించిన సీఎం మమత
కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై గురువారం ఉదయం ఈడీ దాడులు చేసింది. ఐ-ప్యాక్ సంస్థకు చెందిన కీలక అధికారి ప్రతీక్ జైన్ ఇంటితోపాటు, వి.సాల్ట్ లేక్ లోని ఐ-ప్యాక్ ఆఫీసుపై కూడా ఈడీ దాడులు కొనసాగిస్తోంది.
Mamata Banerjee : కోల్‌కతాలోని పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ సంస్థపై గురువారం ఉదయం ఈడీ దాడులు చేసింది. ఐ-ప్యాక్ సంస్థకు చెందిన కీలక అధికారి ప్రతీక్ జైన్ ఇంటితోపాటు, వి.సాల్ట్ లేక్ లోని ఐ-ప్యాక్ ఆఫీసుపై కూడా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ సోదాలు జరుపుతోంది. ప్రతీక్ జైన్.. మమత ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ కోసం పని చేసే కీలక వ్యక్తి. టీఎంసీ కోసం రాజకీయ వ్యూహాలు రచిస్తుంటారు.
దీంతో తనకు అనుకూలమైన ప్రతీక్ జైన్ ఇల్లు, కార్యాలయంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు చేయడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దాడులు జరుగుతున్న సమయంలోనే మమత, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లారు. తన పార్టీకి సంబంధించిన కీలక పత్రాల్ని తాను తీసుకున్నట్లు మమత తెలిపారు. తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల వివరాలు, రాజకీయ, ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీ ఈ దాడులు చేస్తోందని మమత ఆరోపించారు. తాము కూడా బీజేపీ ఆఫీసుపై దాడులు చేస్తే ఎలా ఉంటుంది అని మమత ప్రశ్నించారు. తన చేతిలో ఒక ఫైల్ తో మమత మీడియాతో మాట్లాడారు. అలాగే, ఐ-ప్యాక్ ఆఫీసుకు కూడా ఆమె చేరుకున్నారు. ఈడీ దాడులు జరుగుతుండగా.. ఆఫీసు బయట టీఎంసీ కార్యకర్తలు అక్కడ నిరసనలు చేస్తున్నారు.
మరోవైపు ఐ-ప్యాక్ ఆఫీసు వద్ద కేంద్ర బలగాల్ని కూడా మోహరించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా పరిస్తితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈడీ దాడులు జరుగుతున్న వ్యక్తి ఇంటికి సీఎం వెళ్లడాన్ని ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికార్ ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకు మమత ఆటంకం కలిగించడం పనిగా పెట్టుకుందని, ఆమెపై ఈడీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మమత చర్య అనైతికం అని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ED
- I-PAC
- Kolkata
- Mamata Banerjee
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

