వరంగల్ : రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ( ACB ) పట్టుబడుతున్నారు. గురువారం వరంగల్ కేయూసీ సబ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీకాంత్ ( SI Srikanth ) ను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
ఇటీవల ఒక కేసులో పట్టుబడ్డ వ్యక్తి తనపై వెంటనే చార్జ్‌షీట్ నమోదు చేసి పట్టుకున్న వాహనాన్ని, మొబైల్ ఫోన్‌ను తనకు అప్పగించాలని ప్రైవేట్ డ్రైవర్ ద్వారా ఎస్సైను సంప్రదించాడు. దీంతో లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
గురువారం కేయూ జంక్షన్ వద్ద రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ప్రైవేట్ డ్రైవర్‌ను, ఎస్సైను పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి వరంగల్ ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచారు.