Rithu Chowdary | సీరియల్స్, రియాలిటీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రీతూ చౌదరి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు మంచి ఫేమ్ రావడంతో ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు, ఈవెంట్లతో బిజీగా గడుపుతోంది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ స్టోరీ నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. గతంలో రీతూ చౌదరి శ్రీకాంత్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా అతడితో త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ, కొంతకాలానికి వారిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని కూడా రీతూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇక బిగ్ బాస్ షో తర్వాత ఆమె డిమాన్ పవన్ తో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రీతూ ఎప్పుడూ స్పందించలేదు. అయినప్పటికీ ఇద్దరూ కలిసి తరచూ కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు, పోస్టులు షేర్ చేయడం వల్ల ఈ వార్తలు మరింత బలపడ్డాయి. ఇదిలా ఉంటే తాజాగా రీతూ చౌదరి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక భావోద్వేగ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌లో ఆమె సమాజం అమ్మాయిలను చాలా సులభంగా జడ్జ్ చేస్తుందని, కానీ వారి జీవితాల్లో ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయరని పేర్కొంది. తాను నిజంగా ప్రేమించానని, ఆ వ్యక్తిని ఎంతో కేర్ చేసానని, నిజాయితీగా రిలేషన్లో ఉన్నానని చెప్పింది. కానీ చివరకు తానే బాధపడాల్సి వచ్చిందని తెలిపింది. ప్రేమ కోసం అడుగుతూ కూడా చివరికి మోసపోయానని, రిలేషన్ బ్రేక్ కావడంతో తీవ్రంగా డిప్రెషన్‌కు గురయ్యానని తన భావాలను వెల్లడించింది.
అయినా కూడా కుటుంబం, కెరీర్ కోసం ముఖంపై నవ్వుతో ముందుకు సాగుతున్నానని చెప్పింది. కానీ సమాజం మాత్రం నిజం తెలుసుకోకుండా రూమర్స్, ఆరోపణలనే నమ్ముతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక దశలో మాట్లాడే మాటలు కూడా అలసిపోయినప్పుడు నిశ్శబ్దమే బలం అవుతుందని పేర్కొంది. అంతేకాదు, తనను హార్ట్ బ్రేక్ చేసిన వ్యక్తి మరో అమ్మాయితో ముందుకు వెళ్లిపోయాడని కూడా సూచించింది. ఒకప్పుడు ఫ్రెండ్ అని పిలిచిన అమ్మాయితోనే అతడు వెళ్లిపోయాడని చెప్పడం మరింత ఆసక్తిని రేపుతోంది. అంతేకాకుండా ఒక అమ్మాయి డబ్బు లేదా అటెన్షన్ కోసం మరో అమ్మాయిపై ఆరోపణలు చేయడం తనకు షాక్ ఇచ్చిందని కూడా పేర్కొంది. ఈ పోస్ట్‌తో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. రీతూ చెప్పిన కథ తన జీవితానిదేనా? ఆ వ్యక్తి ఎవరు? అది గతంలో ప్రేమించిన శ్రీకాంత్ గురించేనా? లేదా ఇంకెవరైనా ఉన్నారా? అలాగే తనను నెగిటివ్‌గా చూపించిన అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి.