Lok Sabha: లోక్‌సభలో 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
Lok Sabha: లోక్‌సభలో 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ఆర్టికల్ 370 కింద తీర్మానం పాస్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ(Lok Sabha)లో 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ఆర్టికల్ 370 కింద తీర్మానం పాస్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. తొలుత ఇవాళ కాంగ్రెస్ చీఫ్ విప్ కే సురేశ్.. ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ సురేశ్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర ప్రధాన్ మద్దతు ఇచ్చారు. అనుచిత ప్రవర్తన పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు సురేశ్ పేర్కొన్నారు. ట్రెజరీ బెంచ్‌లు కూడా హుందాగా వ్యవహరించాలని ధర్మేంద్ర యాదవ్ అన్నారు. సభా వ్యవహారాలను స్మూత్‌గా నడిపేందుకు లక్ష్మణ రేఖ గీయాల్సి వస్తుందని మంత్రి రిజిజు అన్నారు.
సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని, విపక్షాలకు కూడా సమాన అవకాశం ఇవ్వాలన్ని సురేశ్ కోరారు. అయితే ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్లకార్డులను ప్రదర్శించరాదు అని, ఏఐ జనరేటెడ్ పిక్‌లను వాడవద్దు అని సభ్యులను బిర్లా కోరారు. ఆ తర్వాత రద్దు తీర్మానాన్ని పాస్ చేశారు. సస్పెన్షన్ రద్దు అయిన ఎంపీల్లో గుర్జీత సింగ్ ఔజ్లా, హిబ్బి ఈడెన్, సి కిరణ్ కుమార్ రెడ్డి, అమరిందర్ సింగ్ రాజా వారింగ్, మానికం ఠాగూర్, ప్రశాంత్ పడోల్, డీన్ కురియకోస్, ఎస్ వెంకటేశన్ ఉన్నారు.
సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఆ 8 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు.
#WATCH | Delhi | Eight opposition MPs from the Lok Sabha paid tribute to Mahatma Gandhi after their suspension was revoked by the Lok Sabha Speaker Om Birla today. pic.twitter.com/hy8Ib1BeF3
— ANI (@ANI) March 17, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

