న్యూఢిల్లీ: మాజీ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi) ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రధానిని వరుణ్ మీటయ్యారు. గతంలో ఫిలిబిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో ఇవాళ వరుణ్‌కు అపాయింట్మెంట్ దొరికినట్లు సమాచారం తెలిసింది. దివంగత సంజయ్ గాంధీ కుమారుడే వరుణ్ గాంధీ. వరుణ్ గాంధీ తన ఎక్స్ అకౌంట్లో ఫోటోను పోస్టు చేశారు. వరుణ్ భార్య యామినీ రాయ్ చౌదరీ, కుమార్తె అనసూయ చాలా హ్యాప్ మూడ్‌లో ఉన్నట్లు ఆ పిక్‌లో కనిపించారు.
అయితే మోదీతో వరుణ్ గాంధీ దిగిన ఫోటో వైరల్ కావడంతో.. మళ్లీ బీజేపీలో వరుణ్ గాంధీ క్రియాశీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల వేళ వరుణ్ గాంధీని పక్కనపెట్టారు. 2024లో ఫిలిబిత్ నుంచి మాజీ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేశారు. వాస్తవానికి ఫిలిబిత్ నియోజకవర్గం వరుణ్ తల్లి మనేకా గాంధీ సీటు కావడం గమనార్హం. అయితే 2021లో లకింపూర్లో జరిగిన రైతుల హింస ఘటనపై వరుణ్ బీజేపీ తీరును ఖండించారు. నిరుద్యోగంతో ఉజ్వల స్కీమ్ ఇంకా పలు కేంద్ర ప్రభుత్వ పాలసీలపై వరుణ్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అన్న నినాదాలతో సమస్యలు తీరవని కూడా వరుణ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో వరుణ్ గాంధీ చేరే అవకాశాలు ఉన్నట్లు గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఓ సారి కేదార్‌నాథ్‌లో వరుణ్, రాహుల్ గాంధీలు కలుసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు వరుణ్ నిరాకరించారు.
परिवार सहित श्रद्धेय प्रधानमंत्री श्री @narendramodi जी से मिलकर उनका आर्शीर्वाद और मार्गदर्शन पाने का सौभाग्य प्राप्त हुआ।
आपके आभामंडल में अद्भुत पितृवत स्नेह और संरक्षण का भाव है।
आपसे हुई भेंट इस विश्वास को और भी दृढ़ बना देती है कि आप देश और देशवासियों के सच्चे अभिभावक… pic.twitter.com/RPSuJlbsrq
— Varun Gandhi (@varungandhi80) March 17, 2026