Suriya vs Nayanthara | సూర్య Vs నయనతార.. ఇండిపెండెన్స్ డే వీకెండ్‌కి బాక్సాఫీస్ దగ్గర భారీ పోరు!
Suriya vs Nayanthara | తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగనుంది. గతంలో 'గజిని', 'ఆధవన్', 'మాస్సు ఎంగిర మసిలామణి' వంటి చిత్రాల్లో కలిసి నటించిన స్టార్ హీరో సూర్య, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు ఒకరికి ఒకరు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారబోతున్నారు.
Suriya vs Nayanthara | తమిళ సినీ పరిశ్రమలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరగనుంది. గతంలో ‘గజిని’, ‘ఆధవన్’, ‘మాస్సు ఎంగిర మసిలామణి’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన స్టార్ హీరో సూర్య, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు ఒకరికి ఒకరు బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా మారబోతున్నారు.సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మరియు నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘హాయ్ ‘ చిత్రాలు రెండూ ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నాయి. దీంతో స్వాతంత్య్ర దినోత్సవ సెలవులను లక్ష్యంగా చేసుకుని ఈ రెండు సినిమాలు నేరుగా పోటీ పడనున్నాయి.
మొదట ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అనంతరం నయనతార నటించిన ‘హాయ్’ మూవీ మేకర్స్ కూడా అదే తేదీని రిలీజ్ డేట్‌గా ప్రకటించడంతో బాక్సాఫీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ‘హాయ్’ చిత్రానికి లోకేష్ కనగరాజ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విష్ణు ఏడవన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కవిన్ హీరోగా నటిస్తుండగా, కె. భాగ్యరాజ్, రాధికా శరత్‌కుమార్, ప్రభు, వీటీవీ గణేష్, సత్యన్, అమృత శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియో, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మరోవైపు ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంలో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో కూడిన హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఒకవైపు ఫ్యామిలీ డ్రామాతో సూర్య, మరోవైపు రొమాంటిక్ కామెడీతో నయనతార ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్లో తమిళ సినీ పరిశ్రమలో ఈ క్లాష్ హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

