Watch: జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్.. 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిన టూరిస్ట్
Tourist Falls From Zipline | జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ జిప్‌లైన్‌పై రైడ్ చేస్తున్న టూరిస్ట్ సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: జిప్‌లైన్ సేఫ్టీ లాక్ ఫెయిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ జిప్‌లైన్‌పై రైడ్ చేస్తున్న టూరిస్ట్ సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Tourist Falls From Zipline) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విజయపురకు చెందిన 24 ఏళ్ల కుబేర్ సురపురా తన కుటుంబ సభ్యులతో కలిసి జూలై 3న దండేలిలో ప్రైవేట్ సంస్థ నిర్వహించే స్టెర్లింగ్ రివర్ రిసార్ట్‌కు వెళ్లాడు. అతడు జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా సేఫ్టీ లాక్ ఫెయిల్ అయ్యింది. తుప్పుపట్టిన సేఫ్టీ లాక్ ఊడిపోవడంతో ఆ వ్యక్తి సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. ఆయన కాళ్లు, చేతులు విరిగాయి. నరాలు దెబ్బతిన్నాయి.
కాగా, తీవ్రంగా గాయపడిన కుబేర్‌ను తొలుత దండేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత విజయపురలోని ఆసుపత్రికి మార్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మెరుగైన చికిత్స కోసం మిరాజ్‌కు తరలించారు.
మరోవైపు ఆ ప్రైవేట్ రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా లోపాలపై కుబేర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. సేఫ్టీ లాక్ తుప్పుపట్టడంతో ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. ఆ రిసార్ట్ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని, నిరంతరం తనిఖీలు చేయాలని, భద్రతా లోపాలపై దుష్టిసారించాలని కొందరు సూచించారు. నిర్యక్ష్యం వహించిన ఆ రిసార్ట్‌పై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు.
This horrific accident happened at the Sterling River Resort in Karnataka’s Dandeli on July 3, when Kuber Surpur tried on a zipline. Moments after ride began, the safety lock of the zipline snapped, sending Kuber nearly 40 feet to the ground, suffering severe injuries.
The… pic.twitter.com/el5GdHLVZs
— Vani Mehrotra (@vani_mehrotra) July 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

