Heavy rains | ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు(మంగళవారం) ఉత్తర తెలంగాణ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు( Heavy rains )కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ నగరంలో తేలికపాటి వర్షం కురియనుంది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయాల్లో చెట్ల కింద ఉండొద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి..
India-US trade | ఢిల్లీ ముట్టడికి వేల సంఖ్యలో చేరుకుంటున్న రైతులు : వీడియో
Dengue | నిపుణుల హెచ్చరిక.. ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకుని జీవిస్తున్న డెంగ్యూ దోమలు..