Watch: ‘నన్ను కొట్టండి సర్, కొట్టండి’.. భద్రతా దళాల లాఠీలకు భయపడని సీజేపీ నిరసనకారుడు, వీడియో వైరల్
Mujhe maaro, sir, maaro | నీట్‌తో పాటు జాతీయ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి చెందిన నిరసనకారుడు భద్రతా దళాల లాఠీలకు ఏమాత్రం భయపడలేదు, బెదరలేదు. పైగా ‘నన్ను కొట్టండి సర్, కొట్టిండి’ అని గట్టిగా అరిచాడు. దీంతో భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: నీట్‌తో పాటు జాతీయ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలపై పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి చెందిన నిరసనకారుడు భద్రతా దళాల లాఠీలకు ఏమాత్రం భయపడలేదు, బెదరలేదు. పైగా ‘నన్ను కొట్టండి సర్, కొట్టిండి’ అని గట్టిగా అరిచాడు. దీంతో భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. (Mujhe maaro, sir, maaro) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నీట్ అక్రమాలపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో సీజేపీ కార్యకర్తలు ర్యాలీగా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్ వైపు దూసుకెళ్తున్న వారిని అడ్డుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నించాయి. సీజేపీ కార్యకర్తలను నిలువరించేందుకు లాఠీఛార్జ్ చేయడంతో పాటు బాష్పాయువు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో కొందరు నిరసకారులు అక్కడి నుంచి కాస్త దూరంగా పరుగెత్తారు.
అయితే ఒక నిరసకారుడు మాత్రం భద్రతా దళాల లాఠీఛార్జ్‌కు భయపడలేదు. అతడు ఏమాత్రం బెదరలేదు. పైగా లాఠీ దెబ్బలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. లాఠీలు ఝులిపిస్తున్న భద్రతా సిబ్బందితో ‘నన్ను కొట్టండి సర్, కొట్టిండి’ అని గట్టిగా అరిచాడు. దీంతో భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. కొంతసేపు అలాగే ఉండిపోయారు. ఇంతలో పక్కనే ఉన్న కొందరు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు. ఆ నిరసకారుడిని అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు, నెటిజన్లు దీనిపై స్పందించారు. ‘తమ హక్కులు, ఉపాధి, దేశ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు యువత ఎప్పుడు వీధుల్లోకి వచ్చినా అణచివేత, భయభ్రాంతులకు గురిచేసే చర్యలకు పాలకవర్గం పాల్పడుతుంది. లాఠీలు, బారికేడ్లు, పోలీసుల రక్షణ వెనుక ప్రభుత్వం ఇంకెంతకాలం దాక్కుంటుంది?’ అని ‘ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ’ జాతీయ నాయకుడు ధీరజ్ గుర్జార్ ప్రశ్నించారు.
A protester💔
It shows the people’s frustration with the cowardly government.
The police personnel thought they could chase him away just by hitting him once.
Just see him, how he confronted them and asked the “Mari Sir Maro Mujhe”.
Even the forces stopped beating him☠️… pic.twitter.com/PMYN3h9d0X
— Sanjay Deka (@SanjayDekaFLJ) July 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

