హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని(Delhi) కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు రైతులు చీమల దండులా కదిలి వస్తున్నారు. భారత్–అమెరికా వాణిజ్య(ndia-US trade) ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ నేడు ఢిల్లీలో రైతులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ర్యాలీలో పాల్గొనేందుకు పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌తో సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు దేశ రాజధాని భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి అమెరికాకు మేలు చేస్తోందని మండిపడ్డారు. భారతదేశంలోకి చౌక వ్యవసాయ దిగుమతులను అనుమతించే ఈ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంతో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులు, చిన్న వ్యాపారులు, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతు సంఘాల నేతలు ఆరోపంచారు.
ప్రతిపాదిత ఒప్పందం కొన్ని వస్తువులకే పరిమితం కాదని, వ్యవసాయం, పాడి, పరిశ్రమ, డిజిటల్ వాణిజ్యం, ఈ-కామర్స్, ప్రభుత్వ కొనుగోళ్లు, మేధో సంపత్తి హక్కులు, సేవల రంగాన్ని కూడా ఇది కవర్ చేయవచ్చని పాంధర్ అనే నాయకుడు పేర్కొన్నారు. భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని, అలాగే దేశంలోని రైతులు,సామాన్య పౌరుల ప్రయోజనాలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు శంభు బార్డర్ (పంజాబ్–హర్యానా సరిహద్దు) వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు పోలీసులు అడ్డుకుంటున్నారు.
వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్న రైతులు
బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలపనున్న రైతులు
ప్రతిపాదిత భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు, సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ… pic.twitter.com/8FQq6YQ50O
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026