Bala Krishna | నందమూరి బాలకృష్ణ ఈ వయస్సులోను కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తుండగా, ఈ చిత్ర షూటింగ్ తాజాగా కాకినాడ పోర్ట్ ప్రాంగణంలో జరుగుతుంది. అయితే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం కాకినాడ పోర్ట్ పరిసరాలలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఆయన అనుకోకుండా కాలు జారి కిందపడిపోయారు.దాంతో ఆయన మోకాలిక స్వల్ప గాయం అయింది. వెంటనే చిత్ర బృందం షూటింగ్ ఆపేసి బాలయ్యని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన వైద్య బృందం ఇతర పరీక్షలు కూడా నిర్వహించారు.
స్వల్ప గాయమే అయిందని, కంగారు పడాల్సిన పనిలేదని వైద్యులు స్పష్టం చేశారు. అయితే కొన్ని రోజుల పాటు బాలయ్య విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. గోపిచంద్ మలినేనితో పాటు కొరటాల దర్శకత్వంలోను బాలయ్య ఓ చిత్రం చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎస్ఎల్వీ సినిమాస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో గత చిత్రాలకు భిన్నమైన లుక్‌లో కనిపించనున్నారని, మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో కూడిన మాస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ-కొరటాల శివ కాంబినేషన్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. గతంలో బాలయ్య కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘సింహా’ చిత్రానికి కొరటాల శివ రచనా సహకారం అందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డైలాగ్‌లు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దర్శకుడిగా కొరటాల, బాలయ్యతో సినిమా చేస్తుండటంతో అదే స్థాయి మాస్ ట్రీట్ మరోసారి దక్కుతుందనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి.బాలకృష్ణ కెరీర్లో ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘సింహా’, ‘వీరసింహారెడ్డి’ వంటి ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. అందుకే NBK112 కూడా అదే తరహా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.