నల్లగొండ, జనవరి 08 : ఆరోగ్యవంతమైన యువతే సమాజ భవిష్యత్‌కు బలమని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డులో ఎల్వీ కుమార్ పెట్రోల్ బంక్ పక్కన, కళానికేతన్ భవనంపై ఏర్పాటు చేసిన నూతన జిమ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండేందుకు క్రీడలు, వ్యాయామం దోహద పడుతుందని పేర్కొన్నారు.