Malaysia Open : కొత్త ఏడాదిలో భారత షట్లర్ పీవీ సింధు (PV Sindhu) గొప్పగా ఆడుతోంది. మలేషియా ఓపెన్ సూపర్ 1000లో దూకుడు కనబరుస్తున్న సింధు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అదిరే ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెడుతున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం క్వార్టర్స్ బెర్తు సాధించింది. అయితే.. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు లక్ష్యసేన్, ఆయుష్ శెట్టిల పోరాటం ముగిసింది.
ఒలింపిక్ విజేతైన సింధు నిరుడు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కానీ, కొత్త ఏడాదిలో తను అనూహ్యంగా పుంజుకుంది. మలేషియా ఓపెన్‌లో చెలరేగిపోతున్న భారత స్టార్ గురువారం ప్రీ-క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ తొమొక మియాజకీని చిత్తు చేసింది. టాప్ గేర్‌లో రెచ్చిపోయిన తెలుగుతేజం తొలి సెట్‌ను 21-8తో సునాయసంగా గెలుచుకుంది. రెండో సెట్లనూ సింధు ధాటికి ఎనిమిదో సీడ్ తొమొకను 21-13తో అలవోకగా మట్టికరిపించింది. సెమీస్ బెర్తు కోసం తను జపాన్‌కే చెందిన మూడో సీడ్ అకనె యమగుజితో తలపడనుంది.
Off to the QFs, PV on a super start 🔛#malaysiaopen pic.twitter.com/lRCM01L3Ur
— BAI Media (@BAI_Media) January 8, 2026
పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ ముందే ఇంటిదారి పట్టారు. డబుల్స్‌లో సాత్విక్ – చిరాగ్ జోడీ తిరుగులేని ఆటతో క్వార్టర్స్ చేరింది. నిరుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుపొందిన ఈ జంట మలేషియా ఓపెన్‌లోనూ పతకానికి మరింత చేరువైంది. గురువారం జరిగిన 39 నిమిషాల పోరులో జునైదీ అరిఫ్ – రాయ్ కింగ్ యాప్(మలేషియా) జంటను 21-18, 21-12తో ఓడించింది సాత్విక్ – చిరాగ్ ద్వయం.
Brothers of Destruction into the QFs 🤩⚡️#MalaysiaOpen pic.twitter.com/njjQd7HLqA
— BAI Media (@BAI_Media) January 8, 2026