హనుమకొండ చౌరస్తా, జనవరి 8: కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ బి.సురేష్ లాల్ రచించిన ‘రివర్స్ ఆఫ్ గ్రేస్’ అనే గ్రంథాన్ని ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్, చీఫ్ కన్వీనర్ డాక్టర్ అనిల్‌కుమార్ ఠాకూర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అనిల్ ఠాకూర్ మాట్లాడుతూ సురేష్‌లాల్ పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై లోతైన పరిశోధనలు చేశారు. వివిధ వ్యాసాలను, పదుల సంఖ్యలో గ్రంథాలను రచించిన అనుభవం ఆయనకు ఉందని తెలిపారు.
‘ప్రస్తుత గ్రంథంలో మానవాళి మనుగడలో జలవనరుల ఆవశ్యకతపై విస్తృతమైన విశ్లేషణతో కూడిన అంశాలను పొందుపరిచారు’ అని అన్నారు. సామాజిక శాస్త్ర పరిశోధకులే కాకుండా అన్ని విభాగాల విద్యార్థులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు. పుస్కకావిష్కరణ కార్యక్రమంలో పాలకమండలి సభ్యురాలు కే.అనితారెడ్డి, అర్థశాస్త్ర అధ్యాపకులు, పరిశోధకులు సాంబశివరావు, వీరేందర్, రాజేష్, శ్రీధర్‌కుమార్‌లోథ్, హరిశంకర్, రవీందర్, నవీన్, వెంకన్న పాల్గొన్నారు.