Sankranti Holidays : తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు సంక్రాంతి(Sankranti) సెలవులను ప్రకటించింది. పండుగ సమీపిస్తున్నందున జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ హాలీడేస్ ఇస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
సంక్రాంతి పండుగ 15వ తేదీన ఉండగా.. డిసెంబర్ 16న కనుమ ఉంది. దాంతో.. ఆ రోజు కూడా సెలవు ఇచ్చారు. స్కూళ్లు జనవరి 17న పునః ప్రారంభం అవుతాయి. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు ఈ ఉత్తర్వులను పాటించాలని నికోలస్ తెలిపారు.