Buddy | టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ (Allu Sirish) నటించిన తాజా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ బడ్డీ (Buddy). సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటించగా.. అజ్మల్, ప్రిషా రాజేశ్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఆగష్టు 02న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సోంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఆగష్టు 30 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వృత్తిరిత్యా పైలెట్ అయిన ఆదిత్య(అల్లు శిరీష్).. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే పల్లవితో మాట కలుస్తుంది. ఒకరినొకరు చూసుకోకుండానే మనసులు కూడా కలుస్తాయి. ఆదిత్యకు తన మనసులో మాట చెప్పే రోజు కోసం పల్లవి ఎదురుచూస్తూవుంది. సరైన సందర్భం చూసి, ఆదిత్యకు ఐలవ్యూ చెప్పేయాలనుకుంది. కానీ.. తను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆదిత్య ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. దాంతో నేరుగా వెళ్లి ఆదిత్యకు క్షమాపణ చెబుదామనుకుంది. ఇంతలోనే తను కిడ్నాప్ అయ్యింది. ఈ క్రమంలో జరిగిన గొడవలో తను కోమాలోకి వెళ్లగా.. ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్లోకి వెళ్లింది. ప్రాణంతో ఉండగానే ఆత్మ బయటకు రావడం ఏంటి? అసలు పల్లవిని కిడ్నాప్ చేసిందెవరు? ఈ కిడ్నాప్కీ హాంకాంగ్‌లో ఉన్న అర్జున్కుమార్వర్మ(అజ్మల్)కూ ఉన్న సంబంధం ఏంటి? పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు? అ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
Edhuru thirigina simhani, puli ni, chiruthani choosuntaru, anyayam pai thiragabadda oka teddy bear ni choosara? Ippudu choostharu.#Buddy is coming to Netflix on 30 August in Telugu, Tamil, Malayalam and Kannada!#BuddyOnNetflix pic.twitter.com/3eaV05kgne
— Netflix India South (@Netflix_INSouth) August 25, 2024
Also Read..