Heavy rainfall : గుజరాత్‌లోని వల్సాద్ పట్టణంలో ఎన్నడూ ఊహించని విధంగా కుంభవృష్టి కురిసింది. రాత్రికి రాత్రే భారీ వర్షం కురవడంతో పట్ణణంలోని కశ్మీర్ నగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. ఎక్కడికక్కడ వరదనీరు నిలిచిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
‘వల్సాద్‌లో గత రాత్రి నుంచి 120 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో వల్సాద్‌లోని కశ్మీర్ నగర్లో భారీగా వరద నీరు చేరింది. నివాసాలు నీట మునిగాయి. దాంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. దాదాపు 100 కుటుంబాలను కశ్మీర్ నగర్ నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశాం.’ అని వల్సాద్ సబ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆస్థా సోలంకీ చెప్పారు.
#WATCH | Valsad, Gujarat: SDM, Astha Solanki says, “There has been around 120 mm of rainfall in the city of ValsValsad since last night…Keeping this in mind, the water level in Kashmir Nagar of Valsad has started rising. So people are being shifted from here. So far, about a… https://t.co/vzLjePhBLA pic.twitter.com/rpw8X37jF4
— ANI (@ANI) August 25, 2024