రంగడిచ్చిన బిడ్డ
‘భార్య, సోదరులు, పుత్రులు, బంధువులు మొదలైన వారి శుభాశుభాలను విని గాని, చూసి గాని యతి చలింపరాదు. శోకహర్షాలను విడనాడాలి..’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. దుస్తులతో సంబంధం లేని యతి లక్షణమిది. మహారాష్ట్రలో గోరా కుంభార్ అనే కుమ్మరి పాండురంగడికి అపారమైన భక్తుడు. అతను నిరంతరం విఠలుడి నామస్మరణ చేస్తూ ఉండేవాడు.
- ఉపనిషత్ వాక్యం
జాయా భ్రాతృ సుతాదీనాం బన్ధూనాం చ శుభాశుభమ్
శ్రుత్వా దృష్ట్వా న కంపేత శోకహర్షౌ త్యజే ద్యుతిః॥
(నారద పరివ్రాజ కోపనిషత్తు 4-9)
‘భార్య, సోదరులు, పుత్రులు, బంధువులు మొదలైన వారి శుభాశుభాలను విని గాని, చూసి గాని యతి చలింపరాదు. శోకహర్షాలను విడనాడాలి..’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. దుస్తులతో సంబంధం లేని యతి లక్షణమిది. మహారాష్ట్రలో గోరా కుంభార్ అనే కుమ్మరి పాండురంగడికి అపారమైన భక్తుడు. అతను నిరంతరం విఠలుడి నామస్మరణ చేస్తూ ఉండేవాడు. స్వామిని తలుస్తూ తన్మయత్వంలో లోకాన్నే విస్మరించేవాడు. ఒకనాడు కుండల కోసం మట్టిని సిద్ధం చేస్తుండగా.. అతని భార్య తమ పసివాణ్ని అక్కడే వదిలి నీళ్ల కోసమని బయటికి వెళ్తుంది. దోగాడే బిడ్డడు ఉన్నట్టుండి మట్టి గుంటలో పడిపోతాడు. గోరా మట్టి తొక్కుతూ పాండురంగ నామస్మరణం చేస్తూనే ఉంటాడు. ఆ పసివాడు గోరా కాళ్లకింద పడి ప్రాణాలు కోల్పోతాడు. కాసేపటికి వచ్చిన గోరా భార్య.. రక్తసిక్తమైన మట్టిని చూసి గోడుగోడునా ఏడుస్తుంది. అంత జరిగినా గమనించలేదు గోరా. అయినా అతనేం పట్టించుకోకుండా విఠలుణ్ని కీర్తిస్తూనే ఉన్నాడు. ఇంత జరిగినా.. ఆ పసివాడు దగ్గరికి వచ్చినట్టుగానీ, మట్టి గుంటలో పడినట్టుగానీ, తాను పొరపాటున తొక్కేసినట్టుగానీ అతనికి స్ఫురించనే లేదు.
భార్య పిల్లవాడిని తన దగ్గర వదిలిపెట్టినట్టు కూడా మరచే పోయినాడు. అతనికి తెలిసింది ఒకటే! విఠలుని మహిమా గానం. సన్యాసి ఐతే ఏమీ సంసారి ఐతే ఏమీ! అతనొక గొప్ప యతి. కాసేపటికి అతను తెప్పరిల్లాడు. బాధపడ్డాడు. చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా తన రెండు చేతులూ విరుచుకున్నాడు. వ్యాపారం దెబ్బతిన్నది. విఠలుడు, రుక్మిణీదేవి మారు రూపాలతో వచ్చి అతని ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టారు. క్రమంగా గోరా వ్యాపారం పుంజుకుంది. ఒకనాడు మహాభక్తుడైన నామదేవ్ పరివారంతో పండరీపూర్ వెళుతూ గోరా ఇంటికి వచ్చాడు. సంకీర్తన చేస్తూ చేతులు పైకెత్తి చప్పట్లతో భక్తులను ఉత్సాహపరిచినాడు. గోరా కూడా పాడుతూ చేతులు పైకెత్తాడు. భక్తులు కేరింతలు కొడుతున్నారు. అతనికేమీ అర్థం కాలేదు. చేతులను చూసుకుంటే సలక్షణంగా మునుపటిలాగే వచ్చేశాయి. ‘నా బిడ్డను కూడా నాకు ప్రసాదించు తండ్రీ! నేను జీవించలేను’ అంటూ విఠలుడికి మొరపెట్టుకున్నది గోరా భార్య. ఆనాడు పోయిన బిడ్డడు చకచక పాకుతూ అక్కడికి వచ్చాడు. రంగడి లీలకు అందరూ పరవశించారు.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

