కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ ( Premier League ) సందడి మొదలైంది. ఆదివారం కాసిపేట మండల ప్రీమియర్ లీగ్ (కేఎంపీఎల్) సీజన్ – 4 క్రికెటర్ల వేలం పాట ఉత్సాహంగా సాగింది. మందమర్రి సీఈఆర్ క్లబ్ లో అట్టహాసంగా జరిగిన కేఎంపీఎల్ సీజన్ – 4 క్రికెటర్ల వేలం పాట నిర్వహించారు. మొత్తం 212 మంది క్రికెటర్లు ఉండగా లీగ్లో రిజిస్టరైన పది ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన క్రికెటర్లను వేలం పాటలో అత్యధిక బిడ్ చేసి జట్టును దక్కించుకున్నారు.
గోవా సూపర్ కింగ్స్ సీఎస్ కే, డేంజర్ డోమినేంట్స్, బ్రేవ్ హార్ట్ సోల్జర్స్, దేవాపూర్ స్టార్స్, సన్ రైజర్స్ కాసిపేట, పల్లంగూడ టైటాన్స్, ముంబాయి హీరోస్ ముత్యంపల్లి, బస్టాండ్ బ్లాస్టర్స్, రాజ్ కుమార్ రాయల్స్, స్మార్ట్ కూల్ సిస్టమ్స్ గల ఫ్రాంచైజీలు పోటా పోటీగా తమకు కావాల్సిన క్రికెట్ ఆటగాళ్లను కొనుగోలు చేశారు. కేఎంపీఎల్ సీజన్ 4కు నిర్వాహకులుగా నామసాని రాజు, దాసరి శంకర్, మేరుగు శ్రీనివాస్, కంటం తిరుపతి, మద్దివేణి అర్జున్ లు వ్యవహరించారు. ఈ నెలలో ప్రారంభం కానున్న కేఎంపీఎల్ సీజన్ – 4కు అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు.