Menstrual Leave: నెలసరి లీవుల చట్టంతో మహిళలకే సమస్య: సుప్రీంకోర్టు
Menstrual Leave: నెలసరి సమయంలో మహిళలకు పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న అంశంపై చట్టాన్ని చేయాలని కోరుతు దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నెలసరి లీవుల కోసం చట్టాన్ని చేయడం వల్ల .. మహిళల కెరీర్‌కు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ: మహిళలకు తప్పనిసరిగా నెలసరి సెలవు(Menstrual Leave)లు ఇస్తే, దాని వల్ల మహిళలకే సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఒకవేళ బహిష్టు సమయంలో మహిళలకు లీవులు తప్పనిసరిగా ఇవ్వాలన్న చట్టాన్ని అమలు చేస్తే దాని వల్ల ఎవరు కూడా మహిళలను ఉద్యోగంలోకి తీసుకోరు అని సీజేఐ పేర్కొన్నారు. అలాంటి చట్టాలు తయారు చేయడం వల్ల పనిచేస్తున్న మహిళల్లో మానసికమైన భయాందోళనలు కలిగే అవకాశాలు ఉన్నట్లు కోర్టు తెలిపింది. పురుషుల కన్నా తాము తక్కువ అన్న భావన వారిలో కలుగుతుందని సీజే తెలిపారు. మహిళలకు నెలసరి సమయంలో కచ్చితంగా లీవులు ఇవ్వాలన్న చట్టాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి తన పిటీషన్లో కోరారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసం.. అలాంటి చట్టాలతో మహిళలకే సమస్య వస్తుందని పేర్కొన్నది.
రుత్రుక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, భిన్నమైన రీతిలో ఆ అంశాలపై సెన్సిటైజ్ చేయాలని, కానీ నెలసరి లీవులను తప్పనిసరి చేస్తూ చట్టాలను రూపొందిస్తే, అప్పుడు మహిళలను ఎవరూ ఉద్యోగంలో నియమించుకోలేరని సీజేఐ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం పిటీషనర్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తుల మైండ్‌సెట్ మీకు తెలియదని, ఇలాంటి చట్టాలు చేస్తే, వాళ్లు మహిళలను రిక్రూట్ చేసుకోరని సీజే తన తీర్పులో అన్నారు. విద్యార్థినులైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా .. నెలసరి సమయంలో మహిళలకు లీవులు ఇవ్వాలని పిటీషనర్ కోరారు. అయితే ఇలాంటి అభ్యర్థనల వల్ల భయాందోళనలు పెరుగుతాయని చీఫ్ జస్టిస్ అన్నారు. మహిళలను బలహీనులుగా చూస్తారని, నెలసరి వల్ల వారికి ఏదో చెడు జరుగుతుందని భావిస్తారన్నారు.
సీనియర్ అడ్వకేట్ ఎంఆర్ షాంషాద్ మాట్లాడుతూ.. 2013లో కేరళ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేశారు. అన్ని వర్సిటీలకు చెందిన మహిళా విద్యార్థినులకు నెలసరి లీవులు మంజూరీ చేసిందని, సీఎం పినరయి విజయన్ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ప్రైవేటు కంపెనీలు కూడా ఇలాంటి సడలింపులు ఇచ్చినట్లు అడ్వకేట్ షంషాద్ తెలిపారు. అయితే ఈ అంశంపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ.. అవన్నీ ఆ క్షణం తీసుకున్న నిర్ణయాలని, ఒకవేళ తప్పనిసరి చేస్తూ చట్టాన్ని రూపొందిస్తే, అప్పడు మహిళలకు ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని అన్నారు. న్యాయవ్యవస్థలో కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ వాళ్లను తీసుకోరన్నారు. వాళ్ల కెరీర్ ముగుస్తుందని, ఇంటి వద్దే కూర్చోవాలని అంటారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

