Anushka Shetty | అనుష్క పెళ్లిపై మళ్లీ ఊహాగానాలు.. ఈ ఏడాదే స్వీటీ పెళ్లి చేసుకుంటుందంటూ ప్రచారం..!
Anushka Shetty | తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి పెళ్లి గురించి తాజాగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చినా కూడా అనుష్కకు ఉన్న ప్రత్యేక స్థానం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తన నటన, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించిన ఈ ముద్దుగుమ్మ గురించి పెళ్లి వార్తలు గతంలో కూడా పలుమార్లు వినిపించిన సంగతి తెలిసిందే.
Anushka Shetty | తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి పెళ్లి గురించి తాజాగా సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చినా కూడా అనుష్కకు ఉన్న ప్రత్యేక స్థానం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. తన నటన, వ్యక్తిత్వంతో ప్రేక్షకుల్లో అపారమైన అభిమానాన్ని సంపాదించిన ఈ ముద్దుగుమ్మ గురించి పెళ్లి వార్తలు గతంలో కూడా పలుమార్లు వినిపించిన సంగతి తెలిసిందే. అనుష్క తన సినీ ప్రయాణాన్ని సూపర్ సినిమాతో ప్రారంభించింది. ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి వరుస విజయాలను అందుకుంది. ఒక సమయంలో తెలుగు సినిమాల్లో ఏ సినిమా చూసినా అనుష్కనే హీరోయిన్గా కనిపించేది.
తర్వాత కాలంలో ఆమె పాత్రలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగింది. ముఖ్యంగా బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాల ద్వారా అనుష్క పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమాల విజయంతో ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. అయితే గత కొన్నేళ్లుగా అనుష్క సినిమాల సంఖ్య తగ్గించింది. ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. గతంలో అనుష్క ఒక డాక్టర్‌ను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపించాయి. అలాగే ఒక స్టార్ హీరోతో ఆమె వివాహం జరగబోతుందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలన్నింటికీ ఎప్పుడూ అధికారిక ధృవీకరణ రాలేదు.
ఇప్పుడు తాజాగా మరోసారి అనుష్క పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె వయసు 44 సంవత్సరాలు కాగా, కుటుంబ సభ్యుల ఒత్తిడి పెరగడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. కుటుంబానికి దగ్గర బంధువైన ఒక వ్యాపారవేత్తతో ఆమె వివాహం జరగబోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కూడా జరిగినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో అనుష్క సినిమాలకు కొంత దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆమె కొత్త ప్రాజెక్టుల విషయంలో కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

