Tumbbad Movie | కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ‘తుంబాడ్’ (Tumbbad) ఒకటి. మైథలాజికల్ హారర్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇక 2018లో చిన్న సినిమాగా విడుదలైన ‘తుంబాడ్’ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టడమే కాకుండా, రివ్యూల పరంగానూ మెప్పు పొందింది.
ఈ సినిమాకు వచ్చిన ఆధరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో మేకర్స్ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ఇక రిలీజైన ప్రతి భాషలో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక లాక్ డౌన్ టైంలో ఓటీటీలో వచ్చి అక్కడ కూడా రేటింగ్స్ పరంగా మంచి రికార్డ్ నమోదు చేసింది ఈ సినిమా.
అయితే ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆగష్టు 30న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Tumbbad is re-releasing in theatres on August 30. pic.twitter.com/udcUV5ME1S
— Films and Stuffs (@filmsandstuffs) August 24, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. స్వాతంత్ర్యంకు ముందు మహారాష్ట్రలోని తుంబాడ్ అనే గ్రామంలో దాగి ఉన్న నిధి గురించి సాగే అన్వేషణతో ఈ కథ ఉంటుంది. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో సినిమాలో చక్కగా చూపించారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఆరేళ్ల పాటు తెరకెక్కించగా.. అనేక సన్నివేశాలను రీషూట్ చేయాల్సి వచ్చింది.
Also Read..