హైదరాబాద్ : రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు పాలనపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదని, పనికిమాలిన పాలన అని మండిపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ.. ఇవాళ నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించతలపెట్టారు. చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు ర్యాలీ నిర్వహించాలని భావించారు.
ఈ క్రమంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ నుంచి నిరుద్యోగులు బయలుదేరకముందే పోలీసులు వారిని గేటులోపలికి పంపి తాళం వేశారు. దాంతో నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపైన, ఆ పార్టీ హైకమాండ్పైన మండిపడ్డారు. మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని విమర్శలు గుప్పించారు. రాహుల్‌గాంధీ ఒక 420, ఆయనొక చెల్లని పైసా అని, తమను దగా చేశాడని విమర్శలు గుప్పించారు.
కోదండరామ్ కూడా మంచోడు అనుకున్నామని, వాళ్ళు తమను వాడుకుని పదవులు పొందారని ఆరోపించారు. బల్మూరి వెంకట్ పెద్ద దొంగ అని, ‘పుస్తకాలు పక్కన పెట్టి మాకు సపోర్ట్ చేయండి.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం’ అని చెప్పి మోసం చేశాడని విమర్శించారు.
నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు
హైదరాబాద్ – చిక్కడపల్లి లైబ్రరీ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీగా వెళ్లి, మహా ధర్నా చేయాలని నిర్ణయించుకున్న నిరుద్యోగులను నిర్బంధించిన పోలీసులు
మమ్మల్ని నమ్మించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు.. రాహుల్ గాంధీ ఒక 420
రాహుల్ గాంధీ… https://t.co/DN4Vcjj2n4 pic.twitter.com/NUEyGiLagc
— Telugu Scribe (@TeluguScribe) January 10, 2026