హైదరాబాద్: నిబంధనలు అతిక్రమించిన నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మణికొండ చిత్రపురి కాలినీలోని (Chitrapuri Colony) 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. జీవో నంబర్ 658కు విరుద్ధంగా విల్లాలను నిర్మించినట్లు గుర్తించారు. జీ+1 అనుమతులు తీసుకుని జీ+2 నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. గత పాలకవర్గం దొంగచాటున అనుమతులు పొందినట్లు తేల్చారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు.
గత పాలకవర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వాటిలో తెలిపారు. చిత్రపురిలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీచేశారు. కాగా, సొసైటీ సభ్యులు అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా 7 విల్లాలను అక్రమంగా నిర్మిస్తున్నారు. గుర్తించిన హైడ్రా అధికారులు.. ఈ నెల 21న వాటిని నేలమట్టం చేశారు.