అమరావతి : పచ్చని కోనసీమలో కలకలం రేపిన బ్లోఅవుట్ మంటలు ( Blowout Fires ) ఐదురోజుల తరువాత పూర్తిగా అదుపులోకి వచ్చాయి . డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 డ్రిల్లింగ్సైటులో ఈనెల 5న గ్యాస్ లీకేజీ( Gas Leakage) ప్రారంభమై మంటలు చెలరేగాయి.
అప్పటి నుంచి ఓఎన్జీసీ ( ONGC ) అధికారులు, నిపుణులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నిపుణులు మంగలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు . చివరకు ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం పూర్తిగా దేశీయ పరిజ్ఞాంతో మంటలను ఆర్పీవేశారు. శకలాలను పూర్తిగా తొలగించి, వెల్ క్యాపింగ్ పనులు పూర్తిచేసిన నిపుణుల బృందం ఆపరేషన్ సక్సెస్ కావడంతో సంబరాలు చేసుకుంది.
ఈ సందర్భంగా నియోజక వర్గ ఎంపీ హరీష్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే మంటలను నియంత్రించడం పట్ల ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందానికి అభినందనలు తెలిపారు. మంటల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిహారం అందిస్తామని వెల్లడించారు.