హైదరాబాద్ : ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్ జే దొర ( HJ Dora ) నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధి తో బాధ పడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడం తో నిమ్స్ ఏఆర్సీయూ చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దొర ఉమ్మడి ఏపీలో మొదట అడిషనల్ డీజీపీగా అనంతరం డీజీపీగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొర 1993లో పీపుల్స్‌వార్ గ్రూప్ లక్ష్యంగా చేసుకున్న 40 మంది కీలక పోలీసు అధికారుల జాబితాలో ఆయన పేరుకూడా ఉంది. 2002లో కేంద్ర సర్వీసులకు వెళ్లిన దొర ఢిల్లీలో సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు.
భారత విజిలెన్స్ కమిషనర్‌గా ఆయన సేవలందించారు. ఆయన భౌతిక కాయానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ కమిషనర్ విసి సజ్జనర్ , మాజీ పోలీసు అధికారులు నివాళి అర్పించారు.