U20 Championships | హై జంప్‌లో భారత్‌కు తొలి రజతం.. చరిత్ర సృష్టించిన బసంత్..!
U20 Championships: జావెలిన్ త్రోలో పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అశిష్ యాదవ్ (Ashish Yadav) రజతం కొల్లగొట్టగా.. హై జంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ (Basant Kumar Meghwal) చరిత్ర సృష్టించాడు.
U20 Championships: అమెరికాలోని ఒరెగా వేదికగా జరుగుతున్న అండర్ 20 ఛాంపియన్షిప్స్ 2026లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. జావెలిన్ త్రోలో పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అశిష్ యాదవ్ (Ashish Yadav) రజతం కొల్లగొట్టగా.. హై జంప్‌లో బసంత్ కుమార్ మేఘ్వాల్ (Basant Kumar Meghwal) చరిత్ర సృష్టించాడు. పురుషుల ఫైనల్లో సత్తా చాటిన బసంత్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి వెలుగులు విరజిమ్మాడు.
అండర్ 20 ఛాంపియన్‌షిప్స్‌లో భారత కుర్రాళ్లు రికార్డులు పట్టేస్తున్నారు. జావెలిన్ త్రోలో భావి తారగా ఎదుగుతున్న అశీష్ యాదవ్ సిల్వర్ మెడల్ సాధించిన మరునాడే.. హై జంపర్ బసంత్ కుమార్ మేఘ్వాల్ సైతం వెండి పతకం గెలుపొందాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత అథ్లెట్ రెండో ప్రయత్నంలో ఏకంగా 2.21 మీటర్ల ఎత్తు దూకాడు. తద్వారా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్వనతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.
🚨 Watch Basant win SILVER for India at World U20!!!
🥇 🇩🇿 Younes Ayachi – Gold
🥈 🇮🇳 Basant – Silver
🥉 🇺🇸 Otis Poole – BronzeAll three medal-winning athletes cleared the same height of 2.21m in High Jump.
The medals were therefore decided on countback, based on the number… pic.twitter.com/lYsbXwhjk5
— nnis Sports (@nnis_sports) August 9, 2026
అండర్ 20 ఛాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు హై జంప్‌లో తొలి పతకం సాధించిన బసంత్ చరిత్రకెక్కాడు. లాంగ్ జంప్‌లో షహన్వాజ్ ఖాన్ కాంస్యంతో మెరిశాడు. శనివారం పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో అశీష్ యాదవ్ 74.09 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానంతో రజతం పట్టేసిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం నీరజ్ పసిడి గెలిచిన ఈ టోర్నీలో అశీష్ అంచనాలు అందుకుంటూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

