ఇంట్లో పాత మోడల్ టీవీ ఉందా? కారులో బ్లూటూత్ లేని పాత మ్యూజిక్ సిస్టమ్ ఉందా? వీటికి మీ బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ పాత వస్తువులను మార్చాల్సిన అవసరం లేదు. కేవలం ఈ చిన్న గ్యాడ్జెట్ ఉంటే చాలు. అదే Amazon Basics 2-ఇన్-1 బ్లూటూత్ 5.0 అడాప్టర్. ఇది మీ పాత డివైజ్‌లకు వైర్లెస్ పవర్ ఇచ్చే మ్యాజిక్ బాక్స్. దీన్ని పాత టీవీ లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తే.. సౌండ్‌ను మీ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌లో వినొచ్చు. దీంతో రాత్రిపూట ఇతరులకు ఇబ్బంది లేకుండా టీవీ చూడొచ్చు. ఇది కారు మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా బ్లూటూత్ స్పీకర్లుగా మార్చేస్తుంది. ఇందులో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ ఉంది. 10 మీటర్ల రేంజ్ వరకు స్ట్రాంగ్ కనెక్టివిటీని అందిస్తుంది. దీంతో ఆడియో కట్ అవ్వకుండా, స్పష్టమైన సౌండ్ లభిస్తుంది. వాడేందుకు ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు. అంతేకాదు.. 3.5mm ఆక్స్ (AUX) కేబుల్‌తో.. టెక్నాలజీ తెలియని యూజర్లు సులభంగా వాడొచ్చు.
ధర: సుమారు రూ. 900 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్
ఎక్స్ట్రా లగేజీ టెన్షన్ బంద్!

విమాన ప్రయాణం చేస్తున్నారా? లగేజీ బరువు పరిమితి కంటే ఎక్కువగా ఉంటే ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఫీజు వసూలు చేస్తారు. చెక్-ఇన్ కౌంటర్ దగ్గర బరువు చూసుకోవడం.. ఒకవేళ ఎక్కువ ఉంటే బ్యాగులో నుంచి తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యకు సింపుల్ అండ్ స్మార్ట్ సొల్యూషన్.. Amazon Basics డిజిటల్ లగేజీ స్కేల్. ఇది మీ బ్యాగ్ బరువును ముందే కచ్చితంగా చెప్పేస్తుంది. ఈ స్కేల్ 50 కిలోల వరకు బరువును చాలా సులువుగా కొలుస్తుంది. దీంతో మీరు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉండొచ్చు. ఇందులో బ్యాక్‌లైట్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. తక్కువ వెలుతురులో కూడా బరువును స్పష్టంగా చదువుకోవచ్చు. చాలా చిన్నగా, తేలికగా ఉంటుంది. అవసరం మేరకు దీన్ని మీ హ్యాండ్ బ్యాగ్ లేదా పర్సులో సులభంగా పెట్టుకోవచ్చు. ప్రయాణాల్లో అస్సలు బరువు అనిపించదు. స్టీల్‌తో తయారైన బాడీ.. చాలా బలంగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌లో అనవసరమైన లగేజీ ఫీజులు కట్టకుండా మీ డబ్బును, సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్.
ధర: సుమారు రూ.700 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్
అమేజింగ్ స్లయిలస్!

ఐప్యాడ్ కోసం ఆపిల్ పెన్సిల్ కొనాలని అనుకుంటున్నారా? కానీ, ధర చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే.. మీ కోసమే అమెజాన్ ఒక అమేజింగ్ గ్యాడ్జెట్‌ను తెచ్చింది. అదే 2nd Gen Stylus Pen. తక్కువ బడ్జెట్లోనే ఒరిజినల్ పెన్సిల్ ఇచ్చే ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. ఇది ఐప్యాడ్ ఎయిర్, మినీ, ప్రో లేక మరేదైనా లేటెస్ట్ M4 మోడళ్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. హై సెన్సిటివిటీతో పని చేసే ఈ పెన్.. ఆర్ట్‌వర్క్ చేసే వారికి చాలా ఉపయోగం. ఈ స్టయిలస్ పెన్లో టిల్ట్ సెన్సిటివిటీ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. దీంతో మీరు పెన్నును వంచి పట్టుకున్నప్పుడు కూడా స్క్రీన్ ఆ యాంగిల్‌ను గుర్తు పడుతుంది. ఇది డ్రాయింగ్‌లో షేడింగ్ చేయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు ఇందులో శక్తిమంతమైన అయస్కాంతం ఉంది. ఇది ఆపిల్ పెన్సిల్ కంటే బలంగా ఐప్యాడ్ పక్కన అంటుకుని ఉంటుంది. పెన్ ఎక్కడైనా పడిపోతుందనే భయం ఉండదు. తక్కువ ధరలో ఐప్యాడ్ పెన్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. స్టూడెంట్స్, డిజిటల్ ఆర్టిస్టులకు ఇదొక పొదుపైన ఎంపిక అని చెప్పవచ్చు.
ధర: సుమారు రూ. 2,500 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్
గేమర్స్ అండ్ టైపిస్ట్స్కు పండుగే!

మీరు కంప్యూటర్లో గేమ్స్ ఆడతారా? లేదా గంటల తరబడి టైపింగ్ చేస్తున్నారా? సాధారణ కీబోర్డులపై టైప్ చేస్తున్నప్పుడు ఆ స్మూత్ ఫినిషింగ్ లేక, కీస్ త్వరగా రెస్పాండ్ అవ్వక ఇబ్బంది పడుతుంటే.. మీరు మారాల్సిన సమయం వచ్చింది. Amazon Basics ప్రో సిరీస్ ఆర్జీబీ మెకానికల్ కీబోర్డ్ ట్రై చేయాలి. ఇది కేవలం కీబోర్డ్ మాత్రమే కాదు, మీ డెస్క్‌టాప్ సెటప్‌కు ఒక లగ్జరీ లుక్ ఇచ్చే గ్యాడ్జెట్ కూడా. దీంట్లో రెడ్ మెకానికల్ స్విచ్‌లు ఉన్నాయి. ఇవి చాలా స్మూత్ అండ్ లీనియర్‌గా ఉంటాయి. చాలా వేగంగా, తక్కువ శ్రమతో టైపింగ్ చేయొచ్చు. ఇక గేమింగ్‌లో అయితే రెచ్చిపోవచ్చు. దీనికి ప్రోగ్రామబుల్ ఆర్జీబీ లైటింగ్ ఉంది. దీంతో మీరు మీ మూడ్‌ని బట్టి కీబోర్డ్ రంగులను మార్చుకోవచ్చు. చీకటిలో గేమింగ్ ఆడేటప్పుడు ఇది అద్భుతమైన పార్టీ వైబ్ ఇస్తుంది. రెగ్యులర్ కీబోర్డులతో పోల్చుకుంటే చిన్నగా ఉంటుంది. దీంతో డెస్క్‌మీద మౌస్ వాడుకోవడానికి ఎక్కువ ప్లేస్ దొరుకుతుంది. డిటాచబుల్ యూఎస్బీ-సీ కేబుల్‌తో వాడుకోవచ్చు. దీంతో ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు.
ధర: సుమారు రూ. 3,500 (ఆఫర్లను బట్టి మారుతుంది).
దొరుకు చోటు: అమెజాన్