Saripodhaa Sanivaaram | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తుండగా.. గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఆగస్టు 29న విడుదల కానుంది. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
యూఎస్ఏ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. అమెరికాలో నానికి ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. ప్రీ సేల్స్ ట్రెండ్ బ్లాక్ బస్టర్ దసరాను మించి ఉండబోతున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. యూఎస్ఏ ప్రీమియర్స్‌లో శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన రూరల్ డ్రామా దసరా రూ.5 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. మీడియం రేంజ్ తెలుగు హీరోకు ఇది టాప్ ఫిగర్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇక యూఎస్ఏలో సరిపోదా శనివారం ప్రీమియర్ షోల కోసం ప్రీ సేల్స్ ఇప్పటికే రూ.కోటి 67 లక్షలకుపైగా కలెక్షన్ మార్క్‌ను అధిగమించింది. విడుదలకు మరో మూడు రోజులున్న నేపథ్యంలో దసరా మార్క్‌ను చెరిపేయడం ఖాయమంటున్నారు సినీ జనాలు. దసరాతో పోటీపడుతూ సాగుతున్న తాజా ట్రెండ్ వివేక్ ఆత్రేయ సినిమాకు బాగా కలిసొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది.
Priyadarshi | సారంగపాణి జాతకం సెట్స్‌లో కేక్ కట్ చేసిన ప్రియదర్శి.. స్పెషల్ ఇదే
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?
Arjun Reddy | అర్జున్ రెడ్డి @ ఏడేండ్లు.. సందీప్ రెడ్డి వంగాకు విజయ్ దేవరకొండ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..?