కాసిపేట, జనవరి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని సింగరేణి డిస్పెన్సరీ వద్ద హార్ట్స్ట్రోక్తో కిందపడ్డ వృద్ధుడికి స్థానికులు సీపీఆర్ ( CPR ) చేసి ఆసుపత్రికి తరలించడంతో అతడికి వైద్యులు వైద్య సహాయం అందిస్తున్నారు. సోమగూడెంకు చెందిన హనుమంతు అనే వ్యక్తి హేయిర్ సెలూన్ కు రాగా హార్ట్ స్ట్రోక్ పాటు బీపీ ఎక్కువై ప్రాణాపాయ స్థితిలో కింద పడిపోయాడు.
అప్రమత్తమైన స్థానికులు రాంచందర్, గాదం శ్రీవాస్తవ్, రామ్ లక్ష్మణ్ తాము పొందిన అవగాహనతో సీపీఆర్ చేసి 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.