Nani | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) ప్రస్తుతం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులో సందడి చేశాడు. అక్కడి మూవీ లవర్స్‌తో కలిసిపోయాడు.
ఈ సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఈవెంట్లో కన్నడ స్టార్ యాక్టర్ శివరాజ్‌కుమార్‌తో మెరిశాడు నాని. త్వరలో Bhairathi Ranagal సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివరాజ్‌కుమార్ నానితో కలిసి సరదాగా చిట్ చాట్ చేశాడు. ఇద్దరు స్టార్ యాక్టర్లు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. నాని, శివరాజ్‌కుమార్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సరిపోదా శనివారంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించారు.
The most powerful forces in their own league ❤️🔥#SaripodhaaSanivaaram x #BhairathiRanagal 🔥@NameisNani @NimmaShivanna #Shivanna #Nani pic.twitter.com/K69dKHYDU1
— Phani Kumar (@phanikumar2809) August 28, 2024
చిట్ చాట్ ఇలా..
ತೆಲುಗು ಸ್ಟಾರ್ ನಾನಿ ಅವರು ಕರುನಾಡ ಚಕ್ರವರ್ತಿ ಶಿವಣ್ಣನವರನ್ನು ಬೇಟಿಯಾದ ಕ್ಷಣ💥🤝💥#Shivanna #Nani #Bengaluru #Annavru #BhairathiRanagalNov15 #KFI @NimmaShivanna @NameisNani pic.twitter.com/Pmf3nDRHsr
— Writer_muttu (@writer_muttu) August 28, 2024
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!