Indra Sequel | ఇటీవలే కల్కి 2898 ఏడీ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు సినిమా రూపంలో మంచి విజయాన్ని అందించింది వైజయంతీ మూవీస్. ఈ లీడింగ్ బ్యానర్ నిర్మాత అశ్వినీదత్ సారథ్యంలో టాలీవుడ్‌కు సూపర్ హిట్స్ అందించి రికార్డుల వర్షం కురిపించింది. వైజయంతీ మూవీస్ నుంచి ఆల్ టైమ్ రికార్డ్సు కొల్లగొట్టిన చిత్రాల్లో టాప్‌లో ఉంటాయి ఇంద్ర (Indra) , జగదేక వీరుడు అతిలోక సుందరి (Jagadeka Veerudu Athiloka Sundari).
చిరంజీవి హీరోగా నటించిన ఈ ఎవర్గ్రీన్ సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. ఈ క్రేజీ సినిమాలకు సీక్వెల్స్ వస్తే ఎలా ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం అశ్వినీదత్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఇంద్ర రీరిలీజ్ గ్రాండ్ సక్సెస్‌లో భాగంగా డైరెక్టర్‌తోపాటు టీం మొత్తానికి చిరంజీవి సత్కారం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ ఉంటాయన్నారు. సీక్వెల్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని, సరైన టైంలో సీక్వెల్స్‌కు సంబంధించిన వివరాలను తెలియజేస్తామన్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాను రాంచరణ్, జాన్వీకపూర్‌తో తీయనున్నారని.. కే రాఘవేంద్రరావు స్థానాన్ని నాగ్ అశ్విన్ రీప్లేస్ చేస్తాడని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందన్నమాట.
ఇంద్ర రీరిలీజ్ సక్సెస్ ట్రీట్ ఇలా..
Megastar Chiranjeevi garu hosted a special tribute for the Indra movie team. @KChiruTweets #MegaStarChiranjeevi #Indra4K #Indra #IndraReRelease #22YearsOfIndra pic.twitter.com/37QILzchh7
— BA Raju’s Team (@baraju_SuperHit) August 26, 2024
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?