Coolie | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) టైటిల్ రోల్లో నటిస్తోన్న కూలీ (Coolie). ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ టీజర్లో బంగారంతో డిజైన్ చేసిన ఆయుధాలు, వాచ్ ఛైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్తను అందరితో షేర్ చేసుకున్నారు మేకర్స్.
ఈ మూవీలో మంజుమ్మెల్ బాయ్స్ యాక్టర్ సౌబిన్ షాహిర్ (Soubin Shahir) కీలక పాత్రలో నటిస్తుననాడు. సౌబిన్ షాహిర్ కూలీలో దయాల్‌గా కనిపించబోతున్నాడు. కూలీ అప్డేట్స్ మొదలు.. అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. మరి ఈ క్రేజీ మాలీవుడ్ యాక్టర్‌ను లోకేశ్ కనగరాజ్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కూలీలో పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీలో రజినీకాంత్ స్మగ్లర్‌గా కనిపించబోతుండగా.. మహేంద్రన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తు్న్నారు.
లోకేశ్ కనగరాజ్ అండ్ టీం ప్రస్తుతం కూలీ మూడో షెడ్యూల్‌ను బీచ్ సిటీ వైజాగ్ సిటీలో చిత్రీకరిస్తుందట. సుమారు 40 రోజులపాటు ఈ షూట్ కొనసాగనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
#CoolieUpdates begin!
Introducing #SoubinShahir as Dayal, from the world of #Coolie @rajinikanth @Dir_Lokesh @anirudhofficial @anbariv pic.twitter.com/XP3HXOfTvc— Sun Pictures (@sunpictures) August 28, 2024
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?