Saripodhaa Sanivaaram| టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) నుంచి యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఎప్పుడెప్పుడా ప్రేక్షకుల ముందుకొస్తుందా.. అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం ఈ మూవీ నేడు (ఆగస్టు 29న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో రెండోసారి వచ్చిన సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి. మరి నాని ఖాతాలో హిట్టు పడిందా..? ఇంతకీ సరిపోదా శనివారం సినిమాపై నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారనే దానిపై ఓ లుక్కే్స్తే..
నెటిజన్ల టాక్.. ట్విటర్ రివ్యూలు..
సరిపోదా శనివారం హ్యాట్రిక్ అంటూ ఇప్పటికే యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ చిత్రం అనుకున్నట్టుగానే ప్రీమియర్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
క్లీన్ సినిమా అని.. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా ఊహించలేదు.. అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
వివేక్ ఆత్రేయకు సక్సెస్ పడినట్టే. ప్రతీ ఒక్కరి కష్టం ఫలించింది.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
ఫస్ట్ హాఫ్ చెప్పుకునేంతగా లేదు. కొన్ని సన్నివేశాలు నెట్టుకొచ్చాయి. కేవలం సెకండాఫ్ సినిమాను సేఫ్ జోన్లో ఉంచుతుందని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
సరిపోదా శనివారం బ్లాక్ బస్టర్. జేక్స్ బిజోయ్ అదిరిపోయే బీజీఎంతో అదరగొట్టేశాడని నాని అభిమాని ట్వీట్ పెట్టాడు.
సెకండాఫ్ డైరెక్షన్ అద్బుతం.. నాని, ఎస్జే సూర్య ఇరగదీశారు.. ఎజేసూర్య కామెడీ టైమింగ్ అదిరింది. జేక్స్ బిజోయ్ బీజీఎం పీక్స్‌లో ఉంటుంది. పక్కా కమర్షియల్ మూవీ తీశాడని ఓ యూజర్ రాశాడు.
ఫస్ట్ హాఫ్ లెంగ్తీగా బోరింగ్ కథనంతో సాగుతుంది. ఇంటర్వెల్ ఫైట్ బీజీఎం అద్భుతమని ఓ నెటిజన్ అంటే.. వివేక్ ఆత్రేయ రిపీట్ ఫీల్ రాకుండా ఈ సారి కథనాన్ని బాగా రాసుకున్నాడని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.
ప్లస్ పాయింట్స్…
యూనిక్ కాన్సెప్ట్‌తో విరామం తర్వాత 45 నిమిషాలు సాలిడ్ కంటెంట్
సూర్యగా కొత్తదనంతో సాగే నాని మెస్మరైజింగ్ యాక్టింగ్
ఇన్స్పెక్టర్ దయానంద్‌గా ఎస్జేసూర్యతోపాటు సపోర్టింగ్ రోల్స్‌లో నటించిన మురళీశర్మ, సాయికుమార్, ప్రియాంకా మోహన్ వారి పాత్రలకు న్యాయం
జేక్స్ బిజోయ్ ట్రెండీ బ్యాక్ గ్రౌండ్ సినిమాకు హైలెట్సాంగ్స్ (సింగిల్ బ్యాక్‌గ్రౌండ్ సాంగ్) లేకుండా 160 నిమిషాలు ఎంగేజింగ్‌గా చూపించడం
మైనస్ పాయింట్స్…
ఫస్ట్ హాఫ్ బోరింగ్‌గా అనిపించే కొన్ని సీన్లు, ఊహించగలిగే సన్నివేశాలు.. కొంచెం లెంగ్తీ రన్‌టైంతో సాలిడ్ యాక్షన్ డ్రామా
ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా.. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించారు.
Excellent film
Nani Sj suriya iragadeesaru
Sj suriya comedy timing excellent
Jakes Bejoy bgm peaks
Peak commercial movie la teesadu Vivek athreya
Asala lag anipinchale
Fights and camera work also good #SaripodaaSanivaaram #SaripodaaSanivaaramReview— Teja_Virat🔥🔥🇮🇳 (@TejaVirat_18) August 29, 2024
Good 1st half.. Athreya narration eesari baaga raasukunnadu. repeat feel lekunda.. #SaripodaaSanivaaram
— ವಾಸು (@dtomobsd) August 29, 2024
Overall review of #SaripodaaSanivaaram:
– Stylish mass film with a gripping second half 🔥
– Unique script, solid 45 mins post-interval 💥
– 160 mins runtime without songs, still engaging 🎬
– @NameisNani shines as Surya in a fresh role 💪
– SJ Surya & supporting cast (Murali… pic.twitter.com/9yVJVebaKZ— The Cine Scout (@TheCineScout) August 29, 2024
Clean film, out and out commercial cinema expect cheyyala 🙏#SaripodaaSanivaaram
— melody (@NtaigurR) August 29, 2024
Blockbuster #SaripodaaSanivaaram
Jakes Bejoy arachakamaina BGM🥵🔥— TarunTejSrivatsa (@Extra_Emotions_) August 28, 2024
Not a great 1st half
Few scenes are dragged
Only 2nd half can save the movie #SaripodaaSanivaaram— saikrishna kakarla (@saikrishnakaka) August 28, 2024
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?