Paraskthi Trailer : వైవిధ్యమైన కథలను ఎంచుకొనే శివకార్తికేయన్ (SivaKartikeyan) హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా ‘పరాశక్తి ట్రైలర్’ వచ్చేసింది. దేశభాషగా హిందీని వ్యతిరేకిస్తూ ఉమ్మడి మద్రాస్‌లో జరిగిన ఉద్యమం నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. హిందీని దేశ భాషగా ప్రకటించడం, అన్ని రాష్ట్రాలపై హిందీని రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ 1960లో తమిళనాడులో చెలరేగిన ఆందోళనల్లో విద్యార్ధి నాయకుడు ‘ఛెజియాన్’ పాత్రలో శివకార్తికేయన్ కనిపించారు.
తమ ప్రాంత ఉనికిని, తమిళ భాష ప్రత్యేకతను కాపాడుకునేందుకు జరిగిన పోరాటంలో ద్యార్థి నాయకుడ శివకార్తికేయన్ పోరాటం సాగించిన తీరు.. అధికారి తిరునాడన్ రవిమోహన్‌తో శివ కార్తికేయన్ తలపడే సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల రేడియో అనౌన్సర్ ‘రత్నమాల’ పాత్రను పోషించింది. అప్పటికాలానికి తగ్గట్టుగా అందాలా భామ చీరకట్టుతో తళుక్కుమంది.
ఉద్యమ నేపథ్యంతో వస్తున్న సినిమాపై హైప్ పెంచేసింది. ఈ సినిమాకు ‘ఆకాశమే హద్దురా’ చిత్రంతో హిట్ కొట్టిన సుధా కొంగర దర్శకత్వం వహించగా, నిర్మాత ఆకాశ్ భాస్కరన్ కాగా జీవీ. ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించాడు. జనవరి 10వ తేదీని పరాశక్తి మూవీ థియేటర్లో విడుదల కానుంది.