Nani | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) నటిస్తోన్న చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో నాని టీం ఇప్పటికే ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు సినిమా గురించి నెట్టింట చక్కర్లు కొడుతున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ఓ లుక్కే్స్తే..
సినిమాలో టైటిల్ రోల్లో నటించిన సూర్య వారానికి ఒక రోజు శనివారం మాత్రమే కోపంగా ఉంటానని తల్లికి వాగ్దానం చేస్తాడు. కేవలం శనివారం మాత్రం అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాడు సూర్య. అతడు తన కోపాన్ని వదిలించుకోవడానికి శనివారాన్ని రోజుగా ఎంచుకున్నాడనేది సినిమాలో కనిపించే మిస్టీరియస్ ఎలిమెంట్. విలన్‌గా నటించిన ఎస్జే సూర్య పాత్ర పేరు ఇన్స్పెక్టర్ దయానంద్. ఈ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు కాగా.. ఈ చిత్రం డబ్డ్ వెర్షన్ SuryasSaturday టైటిల్‌తో విడుదలవుతోంది.
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలోప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. గ్యాంగ్‌లీడర్ తర్వాత నాని, ప్రియాంకా మోహన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించారు.
The Greatest of all time | విజయ్ ది గోట్ రీసెన్సార్.. కొత్తగా ఎన్ని నిమిషాలు యాడ్ చేశారంటే..?
Nani | ఒకే ఫ్రేమ్‌లో నాని, శివరాజ్‌కుమార్.. స్పెషల్ ఏంటో తెలుసా..?
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!