అమరావతి : విజయవాడలో ఐఏఎస్ అధికారి ( IAS Officer ) భార్య అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఐఏఎస్ అధికారి గుజ్జర కిషో భార్య సత్యదీపిక ( Satya Deepika ) గొంతుకు ఇన్ఫెక్షన్ సోకడంతో గత నెల 31న ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతి పట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిషోర్ కుమార్ ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా కెనాల్ పీడీగా పనిచేస్తున్నారు.