ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటిలో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల మేలకలయికగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘నాగబంధం’.
విరాట్‌కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 15న ‘నమో రే..’ అంటూ సాగే ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయనున్నారు. భారతీయ నృత్య కళల వైవిధ్యాన్నీ, వైభవాన్నీ, ఐక్యతను ప్రతిబింబించే అద్బుతమైన విజువల్స్‌తో రూపొందించిన ఈ పాటలో వెయ్యిమంది డ్యాన్సర్లు పాల్గొనడం విశేషం.
శ్రీహర్ష రాసిన ఈ పాటను జునైద్ కుమార్, అభే స్వరపరచగా, సింధూజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారూరి ఆలపించారు. గణేశ్ ఆచార్య, శ్రేష్టివర్మ కొరియోగ్రఫీ అందించారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కళ్యాణ్‌చక్రవర్తి, కెమెరా: సౌందర్‌రాజన్.ఎస్, నిర్మాణం: NIK స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్.