Emergency | బాలీవుడ్ నటి కంగనారనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రాజెక్ట్ ఎమర్జెన్సీ. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ (Emergency )ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు వివాదాలకు అవకాశం ఇవ్వకుండా.. సెప్టెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిషేధం విధించే అవకాశాలున్నాయన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ సినిమా రిలీజ్‌పై ప్రభుత్వం న్యాయపరమైన సంప్రదింపులు జరుపుతూ.. నిషేధం అంశాన్ని పరీలిస్తుందని ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం షబ్బీర్‌ను కలిసి ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం విధించాలని కోరింది. సిక్కు సొసైటీ ప్రతినిధులు సినిమాలో సిక్కు సమాజాన్ని చూపించిన తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. రాష్ట్రంలో సినిమాను నిషేధించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డిని షబ్బీర్ కోరినట్టు సమాచారం.
ఎమర్జెన్సీ సమయంలో పౌరహక్కుల సస్పెన్షన్, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిసిందే. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎమర్జెన్సీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన వివిధ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
ఎమర్జెన్సీ న్యూ లుక్ వైరల్..
The beginning of 50th year of Independent India’s darkest chapter, announcing #KanganaRanaut’s #Emergency in cinemas on 6th September 2024!
The explosive saga of the most controversial episode of history of Indian Democracy,#EmergencyOn6Sept in cinemas worldwide. @KanganaTeam… pic.twitter.com/twCUoyK7sP— Manikarnika Films Production (@ManikarnikaFP) June 25, 2024
జయప్రకాశ్ నారాయణ్ లుక్..
The Man who led a revolution!
Presenting @AnupamPKher as the people’s hero, Lok Nayak JayaPrakash Narayan. #Emergency #KanganaRanaut @nishantpitti @shreyastalpade1 @MrSheetalsharma #AkshtRanaut @writish @gvprakash @manojmuntashir #SamirKhurana #RakeshYadav #AjayRai pic.twitter.com/iDgSSgZ6ws
— Manikarnika Films Production (@ManikarnikaFP) July 22, 2022
అటల్ బిహారి వాజ్‌పేయి లుక్..
Honoured & Happy to play one of the most Loved, Visionary, a true patriot & Man of the masses…Bharat Ratna Atal Bihari Vajpayee ji. I hope I live up to the expectations.
It’s time for #Emergency!
Ganpati Bappa Morya 🙏 pic.twitter.com/kJAxsXNeBd
— Shreyas Talpade (@shreyastalpade1) July 27, 2022