Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వంలో సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోన్న కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో నటిస్తున్నాడు. కంగువ రెండు పార్టులుగా రాబోతుండగా.. కంగువ పార్టు 1 ముందుగా నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సింది.
కంగువ సినిమా వాయిదా వేస్తున్నట్టు నెట్టింట పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ అనుకున్నట్టుగా సినిమా వాయిదా పడ్డది. దీనిక్కారణం రజినీకాంత్ నటిస్తోన్న వెట్టైయాన్ సినిమా. కార్తీ Meiyazhagan ఆడియో లాంచ్ ఈవెంట్లో సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. రజనీకాంత్‌ను తమిళ చిత్రసీమలో ఎంతో ప్రముఖమైన వ్యక్తి అని.. ఆయన నటించిన వెట్టైయాన్, కంగువ సినిమాలను ఒకే రోజు విడుదల చేయడం ఉత్తమం కాదని సూర్య అన్నాడు.
కంగువ అనేది బిడ్డలాంటిది.. సినిమా సృష్టిలో చాలా మంది వ్యక్తులు తమ రక్తం, చెమట, కన్నీళ్లను కురిపిస్తున్నారన్నాడు. సినిమా ఫైనల్‌గా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాన్ని అర్థం చేసుకొని.. మద్దతు ఇవ్వాలని అభిమానులు, మూవీ లవర్స్‌ను కోరాడు సూర్య . కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది.
Indian 2 | ఇండియన్ 2 టీంకు షాక్.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ లీగల్ నోటీసులు..!