Venkat Prabhu | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దళపతి 68 (Thalapathy 68)గా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రమోషన్స్‌లో భాగంగా వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రేక్షకులు ది గోట్ స్క్రీన్ ప్లేను అంచనా వేయలేరని చాలెంజ్ చేస్తున్నా. సినిమా ఎటువైపు వెళ్తుందో వారు (ప్రేక్షకులు) చెప్పలేరు. ది గోట్ Mankatha లైన్లో ఉంటుంది. ట్రైలర్లో సినిమా జోనర్ ఏంటో హింట్ ఇచ్చేశాను. కానీ ఎవరూ కూడా సరిగ్గా గుర్తు పట్టలేదు. కథనంలో ఎలాంటి అయోమయం ఉండదని.. సులభంగా అర్థం చేసుకునేలా ఉంటుందన్నాడు. మన్కథలో ఎమోషన్స్‌ను అంతగా టచ్ చేయలేదు. కానీ ఇందులో ఆ విషయాలపై జాగ్రత్తలు తీసుకున్నా. ది గోట్ విజయ్ ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్‌తో హాలీవుడ్ స్టైల్లో ఉంటుందని చెప్పుకొచ్చాడు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది గోట్‌ను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ ప్రొడక్షన్ తెరకెక్కించనుంది.
Emergency | కంగనారనౌత్ ఎమర్జెన్సీ విడుదలపై నిషేధం..?
COURT | నాని-ప్రియదర్శి ఇంట్రెస్టింగ్.. కోర్ట్ మోషన్ పోస్టర్ వైరల్
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Sreeleela | కోలీవుడ్ ఎంట్రీకి శ్రీలీల రెడీ.. ఏ స్టార్ హీరోతోనంటే..?