Devara | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతోపాటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసింది తారక్ టీం.
ఇందులో భాగంగా విడుదల చేసిన ఫియర్, చుట్టమల్లె సాంగ్స్ లాంచ్ చేయగా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. త్వరలోనే మూడో పాట కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. దేవర థర్డ్ సింగిల్దావుడి (Daavudi) త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు చెబుతూ.. ఈ మాస్ డ్యుయెట్ తారక్-జాన్వీకపూర్ (Janhvi Kapoor) మధ్య ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు.
ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఇటీవలే భయం ముఖ చిత్రాలు.. అంటూ తారక్ కొంచెం నవ్వు.. మరికొంచెం రౌద్రరూపంలో కనిపిస్తున్న లుక్ షేర్ చేయగా.. నెట్టింట గూస్బంప్స్ తెప్పిస్తున్నాడు తారక్. దేవరలో ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవరతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
#Daavudi , next single from #Devara 🎉🎉🎉@tarak9999 anna and #JanhviKapoor on fire🕺💃🔥#KoratalaSiva sir ⚡️⚡️⚡️
— Anirudh Ravichander (@anirudhofficial) September 1, 2024
Indian 2 | ఇండియన్ 2 టీంకు షాక్.. మల్టీప్లెక్స్ అసోసియేషన్ లీగల్ నోటీసులు..!