చెన్నై: రైలులో కాలేజీ అమ్మాయి పక్కన పోలీస్ కానిస్టేబుల్ కూర్చొన్నాడు. ఆమెను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని మొబైల్లో దీనిని రికార్డ్ చేసింది. రైల్వే పోలీసులకు పంపి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు. (Constable Caught Molesting Student) తమిళనాడులో ఈ సంఘటన జరిగింది. ఒక న్యాయ విద్యార్థిని చెన్నై నుంచి కోయంబత్తూరుకు రైలులో ప్రయాణించింది.
కాగా, ఆ కాలేజీ అమ్మాయి పక్కన ఒక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కూర్చున్నాడు. రైలులో ప్రయాణిస్తున్న అతడు ఆమెను అనుచితంగా తాకాడు. ఆ విద్యార్థిని తన మొబైల్ ఫోన్లో దీనిని రికార్డ్ చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సమాచారం ఇచ్చి అలెస్ట్ చేసింది.
మరోవైపు కాట్పాడి జంక్షన్లో ఆ రైలు ఆగడంతో ఆర్పీఎఫ్ పోలీసులు ఆ బోగి వద్దకు చేరుకున్నారు. లా విద్యార్థిని లైంగికంగా వేధించిన ఆర్ఎస్ పురం పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ షేక్ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ఆ పోలీస్ కానిస్టేబుల్‌పై శాఖపర్యంగా చర్యలు చేపడతామని పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. అయితే ఆ కానిస్టేబుల్ కాలేజీ అమ్మాయిని అనుచితంగా తాకిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ரயிலில் மாணவியிடம் காவலர் செய்த செயல்#ssnews #dailynews #newsupdates #trains #police #student pic.twitter.com/JBP9iXTFyc
— SS News Digital (@SSNEWSDigital) December 24, 2025
Also Read:
Girl Dies oF Dog Bite | కుక్క కరవడంతో చికిత్స పొందిన బాలిక.. నెల తర్వాత మృతి