లక్నో: ఒక మహిళతో వ్యక్తికి నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తకు ప్రియురాలు ఉన్న సంగతి ఆమెకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ప్రియురాలితో కలిసి కాబోయే భార్యను హత్య చేశాడు. మృతదేహానికి నిప్పుపెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. (woman Killed by fiance, his lover) ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లాల్దీ హుస్సేనాబాద్ గ్రాంట్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల షాలిమునిష్కు గోండా జిల్లాలోని చాపియాకు చెందిన 22 ఏళ్ల ఇమ్రాన్‌తో కొన్ని నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. వారిద్దరికి త్వరలో పెళ్లి జరుగనున్నది.
కాగా, ఇమ్రాన్‌కు సోషల్ మీడియా ద్వారా సకీనా పరిచయమైంది. కాబోయే భర్తకు ఆమెతో సంబంధం ఉన్న విషయం షాలిమునిష్కు తెలిసింది. వారి రిలేషన్‌పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కాబోయే భార్యను హత్య చేసేందుకు ఇమ్రాన్, సకీనా కుట్రపట్నారు.
మరోవైపు డిసెంబర్ 23న షాలిమునిష్ను సకినా తన ఇంటికి పిలిచింది. అక్కడ ఉన్న ఇమ్రాన్, సకీనా కలిసి షాలిమునిష్ గొంతునొక్కి హత్య చేశారు. సకీనా తల్లి సహాయంతో ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. షాలిమునిష్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
కాగా, షాలిమునిష్ కాలిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గొంతునొక్కి చంపిన తర్వాత ఆమె మృతదేహాన్ని తగులబెట్టినట్లు పోస్ట్‌మార్టంలో తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాబోయే భర్త ఇమ్రాన్, అతడి ప్రియురాలు సకీనాతోపాటు నేరానికి సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Engineering Students Held Hostage | ఇంజినీరింగ్ విద్యార్థులను నిర్బంధించి.. డబ్బు దోపిడీ
Unnao Rape Case | ఉన్నావ్ అత్యాచార బాధితురాలు, తల్లి నిరసన.. లాక్కెళ్లిన పోలీసులు
Girl Dies oF Dog Bite | కుక్క కరవడంతో చికిత్స పొందిన బాలిక.. నెల తర్వాత మృతి