న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యే యోచన సంస్థకు లేదని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ సామ్సంగ్ స్పష్టంచేసింది. కేవలం ఇక్కడి మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ..కృత్రిమ మేధస్సు టెక్నాలజీ అనుసంధానంతో పనిచేసే ఉత్పత్తులను తయారు చేస్తున్నట్టు ప్రకటించింది.
అలాగే అమ్మకాలను పెంచుకోవడానికి కన్జ్యూమర్ ఫైనాన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు సామ్సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జేపీ పార్క్ తెలిపారు. మొబైల్ ఫోన్ డిస్ప్లేలను భారత్‌లో తయారు చేసే ఉద్దేశంలో భాగంగా సంస్థ పీఎల్ఐ స్కీం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. ఐపీవోపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఇలాంటి ప్రతిపాదనేది తమ వద్ద లేదని జేపీ పార్క్ స్పష్టం చేశారు.