టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఏళ్లకు పైగా వివిధ క్యారెక్టర్స్ పోషిస్తూ కంటిన్యూ అవుతున్నారు. అయితే ఇప్పటివరకు బ్రహ్మాజీ పోషించిన క్యారెక్టర్స్ అన్ని ఒకెత్తు అయితే ఇప్పుడు తాజాగా నటించిన ‘హ్యాంగ్ మ్యాన్’ క్యారెక్టర్ ఒక్కెత్తు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో హ్యాంగ్ మ్యాన్ అనే సినిమా రూపొందుతుండగా, దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నారట.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హ్యాంగ్ మ్యాన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్ . ఇందులో తలారిగా నెరిసిన జుట్టుతో చేతిలో పెద్ద చేపను పట్టుకొని నడుస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. తన కెరియర్లో బ్రహ్మాజీ తొలిసారి తలారి పాత్ర చేస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాను రూపొందించాడట డైరెక్టర్ విహాన్. క్లోరో ఫిల్మ్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టాలీవుడ్ హీరో సత్యదేవ్ రిలీజ్ చేసాడు. సినిమాను త్వరలో నెట్ఫ్లిక్స్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.