రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని | బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో వివాహం చేసుకున్నారు. శనివారం వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్‌లో క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా పెళ్లాడినట్లు బ్రిటన్ పత్రికలు పేర్కొన్నాయి.

లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మూడో వివాహం చేసుకున్నారు. శనివారం వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్‌లో క్యారీ సైమండ్స్‌ను రహస్యంగా పెళ్లాడినట్లు బ్రిటన్ పత్రికలు పేర్కొన్నాయి. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన వేడుకలో నెచ్చెలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉండడంతో పెళ్లి కార్యక్రమానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంది. దీనిపై బోరిస్ జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయ ప్రతినిధిని సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు.
జాన్సన్‌కు ఇది మూడో వివాహం కాగా.. 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్ధం చేసుకున్నట్లు జాన్సన్, సైమండ్స్ ప్రకటించారు. బ్రిటన్ ప్రధానికి 56 ఏళ్ల వయస్సు కాగా.. క్యారీ సైమండ్స్‌కు 33 సంవత్సరాలు. వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. 2019లో జాన్సన్ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇద్దరూ డౌనింగ్ స్ట్రీట్‌లో కలిసి నివసిస్తున్నారు. 1822లో లార్డ్ లివర్‌పూల్ తర్వాత బ్రిటన్ ప్రధాని పదవిలో ఉంటూ వివాహం చేసుకున్న తొలి వ్యక్తి బోరిస్ జాన్సన్.
బోరిస్ జాన్సన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనను ఒకసారి కన్జర్వేటివ్ పార్టీ విధాన బృందం నుంచి తొలగించారు. ఆయన రెండు సార్లు విడాకులు తీసుకున్నారు. అయితే తనకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పేందుకు నిరాకరించారు. జాన్సన్ చివరి వివాహం మెరీనా వీలర్ అనే న్యాయవాదితో జరిగింది. వీరికి నలుగురు సంతానం ఉండగా.. ఇద్దరు విడిపోయినట్లు 2018 సెప్టెంబర్‌లో ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

