స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
స్టార్ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం | నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యూఢిల్లీ : నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆసుపత్రులు స్టార్ హోటళ్ల సహకారంతో కొవిడ్ టీకా ప్యాకేజీలు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లలో టీకాలు వేయడం జాతీయ కొవిడ్ టీకా కార్యక్రమానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు హోటళ్లలో వ్యాక్సినేషన్ నిర్వహించొద్దంటూ కేంద్రం శనివారం రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ రాష్ట్రాలకు టీకాల నిర్వహణపై లేఖలో వ్యాక్సినేషన్‌పై మార్గదర్శకాలు సూచించారు.
కేవలం నాలుగు ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లు, ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే సెంటర్లలోనే టీకా వేయాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ప్రభుత్వ దవాఖానాలు.. ప్రైవేటు కంపెనీల పరిధిలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించే వర్క్ ప్లేస్ కొవిడ్ సెంటర్లో, వయో వృధులు, దివ్యాంగుల కోసం గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లు, స్కూళ్లు, కళాశాలలు, వృద్ధాశ్రమాల్లో, పంచాయతీ భవనాల్లో తాత్కాలిక ప్రాతిపదిక ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే టీకాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం నిబంధనలకు విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేయాలని మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు చేపట్టాలన్నారు. మార్గదర్శకాల మేరకు దేశంలో కొవిడ్ టీకా జరిగేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

