హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్ధిని, పరివర్తనను కలిగిస్తాయని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
“Maha shivaratri 2023 | సంతాన ప్రాప్తి కోసం శంకరుడిని ఏ పూలతో పూజించాలి?”
“MahaShivaratri Special | మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.”
“Maha Shivaratri | తెలంగాణలోని ఈ క్షేత్రాలు మహాశివరాత్రి వేడుకలకు ఎంతో ఫేమస్ !”
Maha Shivaratri | ఇద్దరు కవుల ముద్దుల శివుడు.. పాలకుర్తి సోమేశ్వరుడి మహాత్మ్యమిదీ..